raj thakre: అక్షయ్ కుమార్ భారతీయుడు కాదు: రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

  • అక్షయ్ కుమార్ పాస్ పోర్ట్ లో కెనడియన్ గా ఉంది
  • వికీపీడియా కూడా ఆయన భారత్ లో పుట్టిన కెనడియన్ గానే చూపిస్తోంది
  • శ్రీదేవి దేశానికి ఏం సేవ చేసింది?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయుడు కాదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధినేత రాజ్ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అక్షయ్ కుమార్ పాస్ పోర్ట్ లో కెనడియన్ గా ఉందని అన్నారు. వికీపీడియా కూడా ఆయన భారత్ లో పుట్టిన కెనడియన్ గానే చూపిస్తోందని తెలిపారు. ఒకప్పటి నటుడు మనోజ్ కుమార్ అడుగుజాడల్లో అక్షయ్ కుమార్ నడిచే ప్రయత్నం చేస్తున్నాడని రాజ్ ఠాక్రే విమర్శించారు.

‘మోదీ ముక్త భారత్‌’ కోసం కలిసికట్టుగా నడవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సినీ నటి శ్రీదేవి దేశానికి ఏం సేవ చేసిందని ఆమె భౌతికాయంపై తివర్ణ పతాకం ఉంచారని ఆయన ప్రశ్నించారు. అధికార లాంఛనాలతో ఆమెకు ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారని ఆయన నిలదీశారు. బీజేపీయేతర ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించి ఉంటే మీడియా గగ్గోలు పెట్టి ఉండేదని, మోదీ పట్ల ఉన్న భయంతోనే మీడియా మౌనం వహించిందని ఆయన విమర్శించారు.
raj thakre
mumbai
Maharashtra
mns

More Telugu News