KCR: స్వల్పంగా మారిన షెడ్యూల్... కోల్ కతా కాళిని దర్శించుకోనున్న కేసీఆర్

  • కాళీ మాతను దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న కేసీఆర్
  • వెంటనే షెడ్యూల్ లో మార్పులు
  • సాయంత్రం 6 తరువాత కాళీఘాట్ కు కేసీఆర్

నేడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలసి చర్చలు జరపనున్న కేసీఆర్, తన పర్యటన షెడ్యూల్ ను స్వల్పంగా సవరించుకున్నారు. కోల్ కతా వెళుతున్న ఆయన, అక్కడి సుప్రసిద్ధ కాళీ మాత మందిరాన్ని సందర్శించనున్నారు. ఎప్పటి నుంచో తనకు కాళికను దర్శించుకోవాలని ఉందని ఆయన చెప్పిన వెంటనే, అందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.

నేటి సాయంత్రం 6 గంటల తరువాత ఆయన కాళీఘాట్ కు వెళతారని అధికారులు వెల్లడించారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. కాగా, ఈ మధ్యాహ్నం 11.35 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్ బృందం, ప్రత్యేక విమానంలో కోల్ కతాకు బయలుదేరింది. కేసీఆర్ విమానం 1.30 గంటల సమయంలో కోల్ కతా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కానుండగా, అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్ లో సెక్రటేరియేట్ కు కేసీఆర్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News