raj thackeray: రాజ్ థాకరే 'మోదీ ముక్త్ భారత్' పిలుపుతో ముంబైలో ఉద్రిక్తత.. గుజరాతీల దుకాణాలపై దాడులు!

  • మోదీ నుంచి భారత్ కు విముక్తి కల్పించాలంటూ రాజ్ థాకరే పిలుపు
  • విధ్వంసానికి దగుతున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు
  • గుజరాతీలపై దాడులు
భారత దేశానికి ప్రధాని మోదీ నుంచి విముక్తి (మోదీ ముక్త్ భారత్) కల్పించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే ఇచ్చిన పిలుపు ముంబైని షేక్ చేస్తోంది. ఆయన ఇచ్చిన పిలుపుతో పార్టీ కార్యకర్తలు గుజరాతీలపై దాడులకు పాల్పడుతున్నారు. ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఉన్న దాబాలపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.

ముంబై శివార్లలోని వసాయ్ లో గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేశారు. షాపుల సైన్ బోర్డును ధ్వంసం చేశారు. గుజరాతీల ఆస్తులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలో కూడా ముంబై, దాదర్ లలో దాడులు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ముంబైలోని గుజరాతీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
raj thackeray
mns
riots
gujarathi
attacks

More Telugu News