Unnao: బీహార్లో వైద్యుల నిర్వాకం...టార్చిలైట్ వెలుతురులోనే మహిళకు సర్జరీ....! వీడియో వైరల్
- కరెంటు లేకపోవడంతో టార్చిలైటు వెలుతురులోనే సర్జరీ చేసిన వైద్యులు
- తెలుపురంగు దుస్తులకు బదులుగా ఖాకీ చొక్కా వేసుకున్న సర్జన్...!
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
బీహార్లో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఓ హాస్పిటల్లో ఓ మహిళకు సర్జరీ చేయాల్సిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో వైద్యులు టార్చిలైట్ వెలుతురులోనే ఆపరేషన్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సహార్సాలోని సదర్ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే...ఏదైనా సమస్య వచ్చి కరెంటు పోతే సదర్ ఆసుపత్రిలో జనరేటర్ సదుపాయం లేదు. అందువల్ల వైద్యులు టార్చిలైటు వెలుతురులోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది.
ఇందులో సర్జరీ చేస్తున్న వ్యక్తి సాధారణంగా వైద్యులు ధరించే తెలుపు రంగు దుస్తులకు బదులుగా ఖాకీ చొక్కా వేసుకుని ఉండటాన్ని గుర్తించవచ్చు. అంతేకాక రోగికి కుట్లు వేస్తున్నప్పుడు అక్కడే పలువురు గుమిగూడి ఉన్నారు. గతంలో ఖగారియాలోని ఓ ఆసుపత్రిలో మొబైల్ ఫోన్ టార్చిలైటు వెలుతురులో ఓ రోగికి ఆపరేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన కొద్దిరోజులకే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, గత డిసెంబరులో యూపీలోని ఉన్నావో జిల్లాలో సుమారు 32 మందికి ఈ తరహాలోనే కంటి ఆపరేషన్ చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆసుపత్రి అధికారులు ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. బీహార్, యూపీ రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తుండటంతో ఆయా రాష్ట్రాల్లో వైద్య సేవల పరిస్థితిని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు.

#WATCH: A woman is operated upon in torch light at Sadar Hospital in Saharsa as there was no electricity at that time in the hospital. #Bihar pic.twitter.com/HN6T5I2683
— ANI (@ANI) March 19, 2018