jennifer lopez: వేధింపులు నేనూ అనుభవించాను.. ఆ విషయం చెప్పడానికి ఇన్నేళ్లు పట్టింది!: జెన్నీఫర్ లోపెజ్

  • 30 ఏళ్ల తరువాత లైంగిక వేధింపులను బయటపెట్టిన జెన్నీఫర్ లోపెజ్
  • ఆడిషన్స్ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనను బట్టబయలు చేసిన జేలో
  • నాకే ఇంత సమయం పట్టిందంటే సాధారణ యువతుల సంగతేంటి?
హాలీవుడ్‌ లో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం వివిధ రంగాల్లో అన్యాయానికి గురవుతున్న మహిళల ఆలోచనల్లో తీసుకొచ్చిన మార్పు సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది మహిళలు తమతమ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ, అవమానకర సంఘటనలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. వారి సరసన ప్రముఖ పాప్ సింగర్, నటి జెన్నీఫర్ లోపెజ్ (48) చేరింది. అభిమానులు ముద్దుగా జేలో అని పిలుచుకునే జెన్నీఫర్ లోపెజ్ హాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.

దానిపై ఆమె మాట్లాడుతూ, ‘‘ఆ రోజు ఆడిషన్‌ కు నేను ఒక్కదాన్నే వెళ్లాను. ఆడిషన్‌ చేసిన ప్రొడ్యూసర్‌ నన్ను షర్ట్‌ విప్పమని, హాఫ్‌ న్యూడ్‌ గా కనిపించమని అడిగాడు. నేనప్పుడు గట్టిగా నో చెప్పడానికి కూడా ఎలా భయపడ్డానో ఆలోచిస్తే ఈరోజుకీ భయమేస్తుంది. నాకే ఈ విషయం బయటపెట్టేందుకు ఇన్నేళ్లు పట్టిందంటే...ఇక సాధారణ యువతుల సంగతి తల్చుకుంటే భయమేస్తోంది. హాలీవుడ్ ఇప్పటికైనా మారాలి’’ అని పేర్కొంది. కాగా, జెన్నిఫర్‌ లోపెజ్‌ హాలీవుడ్ కు వచ్చి 30 ఏళ్లు దాటింది.
jennifer lopez

More Telugu News