Undavalli: నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాను : ఉండవల్లి అరుణ్ కుమార్
- 1971 ,1972 ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేశా
- ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశాను
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం ఆ వయసులో సహజమేమో!
- 1975లో నాకు ఓటు హక్కు వచ్చింది : ఉండవల్లి
నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశానని ప్రముఖ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘1971 పార్లమెంట్ ఎన్నికలు, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాను. ఇండిపెండెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాను. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉండటమనేది ఆ వయసులో ( పద్దెనిమిదేళ్లు) సహజమేమోనని ఇప్పుడు అనిపిస్తోంది.
అయితే, 1975లో నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు చాలా అవకాశాలిచ్చింది. నన్ను బాగా చూసుకుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ద్వేషం లేదు. నేను ఏదైనా సారథ్యం చేసానంటే.. అది, ‘కాంగ్రెస్’ అనే సూర్యూడికే. 1975 నుంచి బయటకు వచ్చేసే వరకు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ సభ్యుడిగా పని చేశాను’ అని చెప్పారు.