Whatsapp: +86 నంబరుతో జాగ్రత్త.. వాట్సాప్ యూజర్లను హెచ్చరించిన ఇండియన్ ఆర్మీ

  • డిజిటల్ ప్రపంచంలోకీ చొరబడిన చైనా హ్యాకర్లు
  • వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్న వైనం
  • అప్రమత్తంగా ఉండాలంటూ వీడియో విడుదల చేసిన ఆర్మీ

వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు భారత యూజర్లను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారని, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని పేర్కొంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను ట్వీట్ చేసింది.

+86 ప్రారంభమయ్యే నంబరుతో ఎవరైనా గ్రూపులో చేరితే అప్రమత్తం కావాలని సూచించింది. మొబైల్ నంబర్లు మార్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, పాత సిమ్ కార్డులను పూర్తిగా విరగ్గొట్టాలని పేర్కొంది. చైనా హ్యాకర్లు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా దూసుకొస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని భారత ఆర్మీ కోరింది. కాగా, చైనా హ్యాకర్ల గురించి భారత ఆర్మీ గతంలోనూ కొన్ని హెచ్చరికలు చేసింది. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు కొన్ని యాప్‌లను వినియోగించవద్దంటూ జాబితాను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News