mobile apps: షేరిట్, విచాట్, యూసీ న్యూస్ ఇలా 40 యాప్స్ ప్రమాదకరమే!

  • వినియోగించొద్దంటూ బలగాలకు ఆర్మీ హెచ్చరిక
  • డేటా, జాతి భద్రతకు రిస్క్ ఉందని సందేహం
  • ఇవన్నీ స్పైవేర్ లేదా హానికరమైనవని సూచన

భారత ఆర్మీ తన జవాన్లను చైనా యాప్స్ వాడొద్దంటూ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ ఫేస్ ఏకంగా వాట్సాప్ అన్నది చైనా ఆర్మీ హ్యాకింగ్ టూల్ గా మారిందంటూ హెచ్చరించింది. ‘‘విశ్వసనీయ సమాచారం మేరకు చైనా అభివృద్ధి చేసినవి లేదా చైనాతో అనుబంధం ఉన్నవి చాలా ఆండ్రాయిడ్/ఐవోఎస్ యాప్స్ స్పైవేర్ లేదా ఇతర హానికారకాలతో కూడినవి. వీటిని మా దళాలు వినియోగించడం డేటా సెక్యూరిటీ, జాతి భద్రత దృష్ట్యా ప్రమాదకరం’’ అని ఆదేశాల్లో ఆర్మీ పేర్కొంది.

యాప్స్
వీబో, విచాట్, షేరిట్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్ డాగ్, వివావీడియో క్యూయూ వీడియో ఐఎన్సీ, పార్లల్ స్పేస్, ఏపీయూఎస్ బ్రౌజర్, పర్ఫెక్ట్ కార్ప్, వైరస్ క్లీనర్, సీఎం బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్, వాల్ట్ హైడ్, యూకామ్ మేకప్, ఎంఐ స్టోర్, క్యాచే క్లీనర్ డీయూ యాప్స్ స్టూడియో, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ క్లీనర్, డీయూ ప్రైవసీ, 360 సెక్యూరిటీ, డీయూ బ్రౌజర్, క్లీన్ మాస్టర్ చీతా మొబైల్, బైదు ట్రాన్సలేట్, బైదు మ్యాప్, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్, ఫొటో వండర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ న్యూస్ ఫీడ్, విసింక, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, సెల్ఫీ సిటీ, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్, క్యూక్యూ లాంచర్.

  • Loading...

More Telugu News