Yanamala: ‘అవిశ్వాసం’ నుంచి తప్పించుకోవడమంటే రాజకీయ ఆత్మహత్యే!: మంత్రి యనమల
- అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ తిరస్కరించడం తగదు
- సభను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- ‘అవిశ్వాసం’ పై చర్చ చేపట్టకపోవడం పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం
కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసులను తిరస్కరించే అధికారం స్పీకర్ కు లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, ‘అవిశ్వాసం’ నుంచి తప్పించుకోవడమంటే రాజకీయ ఆత్మహత్యతో సమానమని, సభ సజావుగా లేదని అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ తిరస్కరించడం తగదని అన్నారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకపోవడం పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమని యనమల విమర్శించారు.