mokshep sha: వంద కోట్ల వ్యాపారాన్ని త్యజించిన 24 ఏళ్ల యువకుడు!

  • కొల్హాపూర్ లో అల్యూమినియం వ్యాపారం చేసే మోక్షేప్ షాహ్ కుటుంబం
  • వంద కోట్ల టర్నోవర్ కలిగిన అల్యూమినియం బిజినెస్
  • ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్న మోక్షేప్

వంద కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపార కుటుంబ వారసుడు జైన భిక్షువుగా మారనుండడం మహారాష్ట్రలో ఆసక్తి రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ లో అల్యూమినియం వ్యాపారం నిర్వహించే కుటుంబానికి చెందిన మోక్షేప్ షాహ్ (24) సీఏ చేశాడు. అనంతరం రెండేళ్ల పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకున్నాడు.

 ఇప్పుడు ఆ వ్యాపారాన్ని త్యజించి ఆధ్మాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. దీంతో ఏప్రిల్ 20 అమియపురలో మత పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో జైన భిక్షువుగా దీక్ష తీసుకోనున్నాడు. దీనిపై మోక్షేప్ మాట్లాడుతూ, సంపద కన్నా మోక్షమే ప్రధానమని గుర్తించానని తెలిపాడు. ధనంతో అన్నింటినీ కొనొచ్చని, ధనంతో అన్ని ఆనందాలు సమకూరుతాయని చెప్పాడు. అయితే ధనంతో ఆత్మానందం మాత్రం దొరకదని చెప్పాడు. రెండేళ్లు వ్యాపార వ్యవహారాలు చూసినా మనసు మాత్రం దానిపై నిలవలేదని అన్నాడు. అందుకే భిక్షువుగా మారాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News