sasikala pushpa: రచ్చకెక్కిన ఎంపీ శశికళ పుష్ప రెండో పెళ్లి.. కాబోయే భర్తపై మొదటి భార్య ఫిర్యాదు!

  • రామస్వామిని రెండో వివాహం చేసుకోబోతున్న శశికళ పుష్ప
  • పోలీసులను ఆశ్రయించిన రామస్వామి మొదటి భార్య
  • ఆధారాలను మీడియాకు చూపించిన తొలి భార్య

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ, దినకరన్ వర్గీయురాలు శశికళ పుష్ప రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ రామస్వామిని ఆమె పెళ్లాడబోతున్నారు. ఈనెల 26వ తేదీన వీరి వివాహం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో రామస్వామిపై అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2014లో రామస్వామితో తనకు వివాహం జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆమె తెలిపింది. పెళ్లి ఫొటోను, తన బిడ్డతో కలసి రామస్వామితో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె మీడియాకు చూపించింది. శశికళతో వివాహాన్ని అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాహం అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News