usa h1b visa: ఏప్రిల్ 2 నుంచి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తుల స్వీకరణ

  • 2019 ఆర్థిక సంవత్సరం కోటా కింద ప్రాసెసింగ్
  • ఆగిపోయిన ప్రీమియం ప్రాసెసింగ్ 
  • ప్రకటించిన ఫెడరల్ ఏజెన్సీ

కోటి ఆశలతో అమెరికాలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఏప్రిల్ 2 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఐటీ నిపుణులకు హెచ్1బీ వీసాయే ఆధారమన్న విషయం తెలిసినదే. 2018 అక్టోబర్ 1 నుంచి ఆరంభమయ్యే 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1బీ వీసా కోటా కింద దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అలాగే, 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రక్రియ గరిష్ట పరిమితిని చేరడంతో నిలిపివేస్తున్నట్టు ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు దారులు తదుపరి ఆర్థిక సంవత్సరం కోటా కింద ప్రాసెసింగ్ కోసం అభ్యర్థన చేసుకోవచ్చని సూచించింది. హెచ్1బీ అన్నది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను భర్తీ చేసుకునేందుకు వీలు కల్పించేది.

  • Loading...

More Telugu News