no confidence motion: షరా మామూలే... 50 మందిని లెక్కించడం కష్టమంటూ... లోక్ సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్

  • ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే
  • సభను కొనసాగించేందుకు సహకరించాలని కోరిన స్పీకర్
  • ఆర్డర్ లో లేదంటూ లోక్ సభను రేపటికి వాయిదా వేసిన సుమిత్రా మహాజన్


ఊహించిందే మళ్లీ జరిగింది. టీడీపీ, వైసీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని చర్చకు స్వీకరించలేమని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకు ముందు అవిశ్వాస తీర్మానాలను ఆమె చదివి వినిపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. సభను సజావుగా నడిపేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే విన్నవించారు.

మరోపక్క, కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ, సభను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. అయినా ఆ రెండు పార్టీల ఎంపీలు తమ నిరసన కార్యక్రమాలను ఆపలేదు. దీంతో, సభ ఆర్డర్ లో లేదని... ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్న 50 మందిని లెక్కపెట్టడం కష్టం అని చెప్పిన స్పీకర్... సభను రేపటికి వాయిదా వేశారు. 

  • Loading...

More Telugu News