edida sriram: మా నాన్న నటుడు కావాలని వచ్చి నిర్మాత అయ్యారు: ఏడిద శ్రీరామ్
- మా నాన్నగారు రంగస్థల నటులు
- నిర్మాతగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు
- నన్ను నటుడిగా చూసి ఆనందపడ్డారు
తెలుగు ప్రేక్షకులకు ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన నిర్మాతల్లో ఏడిద నాగేశ్వరరావు ఒకరు. ఆయన పేరు చెప్పగానే 'సిరిసిరి మువ్వ' .. 'సితార' .. 'సిరివెన్నెల'.. 'శంకరాభరణం'.. 'సాగర సంగమం' .. 'స్వాతిముత్యం' మొదలైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన తనయుడు ఏడిద శ్రీరామ్ నటుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
" మా నాన్న మాకు స్వేచ్ఛనిస్తూనే క్రమశిక్షణతో పెంచారు. కెరియర్ పరంగా ఆయన మాకు ఎప్పుడూ సలహాలు .. సూచనలు ఇస్తుండేవారు. ఆయన మంచి రంగస్థల నటులు. సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే ఆయన చాలా నాటకాల్లో నటించారు. సినిమాల్లో నటుడిగా స్థిరపడదామని వచ్చిన ఆయన .. నిర్మాత అయ్యారు. నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. నేను నటుడిగా రాణిస్తుండటం చూసి సంతోషపడుతుండేవారు. ఆ మధ్య నేను చేసిన 'శ్రీమంతుడు'ని కూడా ఆయన చూడటం, నాకెంతో ఆనందాన్ని కలిగించింది" అంటూ చెప్పుకొచ్చారు .