Uttar Pradesh: అన్న ముఖ్యమంత్రి... టీ అమ్ముకుని బతుకుతున్న చెల్లెలు!
- ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్
- టీ స్టాల్ పెట్టుకుని బతుకుతున్న ఆయన చెల్లెలు శశిపాయల్
- ఉత్తరాఖండ్ లోని కోఠార్ గ్రామంలో నివాసం
ఓ వ్యక్తి మంచి పొజిషన్ లో ఉంటే, ఎక్కడో వేలు విడిచిన చుట్టరికాలను కూడా గుర్తు చేసుకుంటూ దర్పాన్ని చూపే జనాలున్న ఈ రోజుల్లో ఓ ముఖ్యమంత్రి చెల్లెలు సాధారణ మహిళగా టీ అమ్ముతూ బతుకుతోందన్న సంగతి తెలుసా? ఇండియాలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ చెల్లెలు శశి పాయల్ అలా టీ అమ్ముకుని జీవిస్తోంది.
ఎన్నో సంవత్సరాల పాటు ఆదిత్యనాథ్ ఎంపీగా, ఏడాది నుంచి యూపీకి సీఎంగా ఆయన పనిచేస్తున్నప్పటికీ, శశి పాయల్ మాత్రం గత 23 సంవత్సరాలుగా టీ దుకాణాన్నే నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని కోఠార్ గ్రామంలో ఉన్న శశిపాయల్ కుటుంబం అత్యంత సాధారణ జీవితం గడుపుతోంది. ఆమె భర్త అదే ప్రాంతంలో చిన్న పూజా సామాగ్రి దుకాణం నడుపుతూ కుటుంబ పోషణకు తనవంతు పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ కుటుంబాన్ని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ వారి నిరాడంబరతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.