anil ambani: అంబానీ బ్రదర్స్ భారీ డీల్ కు సుప్రీంకోర్టు బ్రేక్!

  • ఆర్ కాం ఆస్తులను జియోకు అమ్మాలనుకున్న అనిల్ అంబానీ
  • రూ. 39 వేల రుణ భారం నుంచి గట్టెక్కేందుకు భారీ డీల్
  • తాము చెప్పేంత వరకు అమ్మరాదన్న సుప్రీంకోర్టు


అప్పుల సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రిలయన్స్ కమ్యునికేషన్ ఆస్తులను రిలయన్స్ జియోకు అమ్మాలనే ప్రయత్నానికి సుప్రీంకోర్టు మోకాలడ్డింది. అమ్మకాలపై ఉన్న స్టేను ఎత్తి వేసేందుకు నిరాకరించింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు యథాస్థితిని కొనసాగించాలని... తమ అనుమతి లేనిదే డీల్ చేయరాదని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే, దాదాపు రూ. 39 వేల కోట్ల రుణభారం నుంచి గట్టెక్కేందుకు తన వైర్ లెస్ స్పెక్ట్రం, టవర్లు, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ ఆస్తులను జియోకు విక్రయిస్తున్నట్టు ఆర్ కామ్ ప్రకటించింది. అయితే, ట్రైబ్యునల్ ఆర్డర్ కు భిన్నంగా ముందస్తు అనుమతులు లేకుండా ఆస్తులు విక్రయించకూడదంటూ ఈనెల 8న బాంబే హైకోర్టు తెలిపింది. అయితే, రిలయన్స్ కమ్యూనికేషన్ కు మద్దతుగా నిలిచిన ఎస్బీఐ... హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆస్తుల అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీంతో, అంబానీ సోదరుల మధ్య భారీ డీల్ కు బ్రేక్ పడినట్టైంది.

  • Loading...

More Telugu News