India: భారత్ బ్రహ్మోస్ ను ప్రయోగించిన వేళ... పాక్ చేతికి చైనా 'మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్'!

  • సూపర్ సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ ను పరీక్షించిన భారత్ 
  • చైనాకు క్షిపణి ట్రాకింగ్ సిస్టమ్ ను అందజేసిన చైనా
  • ఒప్పందం వివరాలు వెల్లడించని పత్రిక

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను పరీక్షించే సమయంలోనే చైనా తన మిత్రదేశమైన పాకిస్థాన్ కు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన మిస్సైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ను అందజేసింది. పాక్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకే చైనా ఈ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ను పాక్ కు అందజేసినట్టు 'సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌' పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఇటువంటి సున్నితమైన ఆయుధ సంపత్తిని పాకిస్థాన్‌ కు ఇవ్వడం ఇదే తొలిసారి అని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (సీఏఎస్‌) వెల్లడించినట్టు సదరు పత్రిక తెలిపింది. అయితే దీనిని ఎంత మొత్తానికి పాకిస్థాన్ కు చైనా అందజేసిందన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ రెండు దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాల మార్పిడి గతంలో చాలా సార్లు జరిగిన సంగతి తెలిసిందే. చైనా ఇప్పటికే పాక్ కు యుద్ధనౌకలు, ఫైటర్ జెట్స్, స్వల్ప శ్రేణి క్షిపణులను అందజేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News