sbi: ఎస్బీఐకి భారీ కుచ్చుటోపీ పెట్టిన జ్యూయలరీ సంస్థ!
- రూ.250 కోట్లు మోసం చేసిన నాదెళ్ల సంపత్ జ్యూయలరీ సంస్థ
- కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కు ఫిర్యాదు చేసిన ఎస్బీఐ
- సంస్థ ఎండీ. రంగనాథ గుప్తా, ఆయన కుమారులపై కేసు నమోదు
చెన్నైలోని నాదెళ్ల సంపత్ జ్యూయలరీ సంస్థ నకిలీ దస్తావేజులతో ఎస్బీఐ నుండి రూ.250 కోట్ల రుణం తీసుకుని మోసం చేసింది. అయితే 2010 నుంచి జ్యూయలరీ సంస్థ రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం నవంబర్ నుంచి దాదాపు 21వేల కన్నా ఎక్కువ మంది 75 కోట్ల రూపాయల వరకు బంగారం కొనుగోలు కోసం నెలవారీ వాయిదాల రూపంలో ఆ సంస్థకు చెల్లిస్తున్నారు.
దాదాపు వేయి కన్నా ఎక్కువ మంది కస్టమర్ లు ఆ సంస్థపై ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు జ్యూయలరీ సంస్థ బోర్డు మెంబర్స్ ఎండీ. రంగనాథ గుప్తాపైన, ఆయన కుమారులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో శాఖలున్న నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ 2017 అక్టోబరులోనే దివాలా తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.