ghmc: జీహెచ్‌ఎంసీకి రూ.26 కోట్ల బహుమతిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీ విధానానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారం 
  • జీహెచ్‌ఎంసీ సేవలపై ప్రశంసలు
  • ఆర్థిక క్రమశిక్షణ సహా బాండ్ల ద్వారా నిధులు సేకరించడంపై అభినందనలు

జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీ విధానానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ సేవలను మెచ్చుకుంటూ రూ.26 కోట్ల బహుమతి ప్రకటించింది. ఆర్థిక క్రమశిక్షణ సహా బాండ్ల ద్వారా నిధులు సేకరించడంపై జీహెచ్‌ఎంసీని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నుంచి జీహెచ్‌ఎంసీకి లేఖ అందింది.

మరోవైపు ఎస్సార్‌డీ పనులతో పాటు పలు పనుల కోసం మొత్తం రూ.3500 కోట్ల బాండ్లు, రుణాలుగా తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఇటీవలే సిద్ధమై అందుకోసం బాండ్ల ద్వారా దాదాపు ఇప్పటికే రూ.200 కోట్లు సేకరించింది. నిధుల కొరతను అధిగమించడానికి జీహెచ్ఎంసీ పెట్టుబడుల వేటలో భాగంగా ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా బాండ్ల సేకరణకు బీఎస్‌ఈలో లిస్టింగ్ అయ్యింది.

  • Loading...

More Telugu News