Steve Smith: స్మిత్, వార్నర్ లను జీవితకాలం నిషేధించాల్సిందే!
- ట్యాంపరింగ్ చేశామని చెప్పుకున్న స్మిత్, వార్నర్
- గరిష్ఠ శిక్ష విధించాల్సిందే
- స్వతంత్ర కమిషనర్ నివేదిక
బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డామని నిస్సిగ్గుగా చెప్పుకుని, ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లతో పాటు బ్యాట్స్ మెన్ కెమెరాన్ బెన్ క్రాఫ్ట్ లను జీవితకాల నిషేధాన్ని విధించాలని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో కథనం ప్రకారం, వీరిపై పూర్తి నిషేధాన్ని విధించాలని మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన స్వతంత్ర కమిషనర్ రిపోర్టును సమర్పించారు. వీరు చేసిన నేరానికి ఒక మ్యాచ్ నిషేధం, లేదా ఓ మ్యాచ్ లో 100 శాతం ఫీజు జరిమానా ఎంతమాత్రమూ సరిపోవని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. క్రికెట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని గరిష్ఠ శిక్షను అనుభవించేందుకు వీరు అర్హులని, వీరింక తమ జీవితకాలంలో క్రికెట్ ఆడకుండా చేస్తేనే ఆసీస్ పరువు నిలబడుతుందని వ్యాఖ్యానించారు. కాగా, తాము బాల్ ను ట్యాంపర్ చేశామరి అది జట్టు వ్యూహంలో భాగమని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.