TRS: ఏపీకి రావాల్సిన హక్కులపై మేము చాలాసార్లు మద్దతు తెలిపాం : ఎంపీ వినోద్

  • విభజన చట్టం అమలుపై తామే గట్టిగా పోరాడుతున్నాం
  • అవిశ్వాస చర్చల్లో పాల్గొన్ని కేంద్రాన్ని నిలదీస్తాం
  • రాజ్యాంగ హక్కులను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాలరాస్తున్నాయి
  • మీడియాతో టీఆర్ఎస్ ఎంపీ వినోద్

ఏపీకి రావాల్సిన హక్కులపై తాము చాలాసార్లు మద్దతు తెలిపామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం నిమిత్తం తమ పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ మాట్లాడుతూ, విభజన చట్టం అమలుపై తామే గట్టిగా పోరాడుతున్నామని, అవిశ్వాస చర్చల్లో పాల్గొన్ని కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. లోక్ సభలో తమ ఆందోళనపై విపక్ష పార్టీలు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు.

 విభజన తర్వాత రాష్ట్రంలో గిరిజన, మైనార్టీ జనాభా శాతం పెరిగిందని, రిజర్వేషన్లు పెంచాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరిన విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపి, తెలంగాణ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతిస్తే తాము కచ్చితంగా సహకరిస్తామని చెప్పిన వినోద్, రాజ్యాంగ హక్కులను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News