whatsapp: వాట్సాప్ లో డబ్బులు పంపడం ఎంతో ఈజీ... త్వరలో మరో కొత్త ఫీచర్
- క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపే విధానం
- యూపీఐ ఐడీలతో పనిలేదు
- ప్రస్తుతం బీటా వెర్షన్లో అందుబాటు... త్వరలో అందరికీ
వాట్సాప్ ఇటీవలే యూపీఐ ఆధారిత చెల్లింపుల సదుపాయాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసే ఉంటుంది. త్వరలో క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా తీసుకొస్తోంది. దీని ద్వారా డబ్బులు పంపించడం ఎంతో సులభం. మీ స్నేహితుల లేదా బంధువుల వాట్సాప్ క్యూాఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ పిన్ ఇస్తే చెప్పినంత డబ్బులు బదిలీ అయిపోతాయి. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.18.93 వాడుతున్న వారికే ప్రస్తుతం ఈ సదుపాయం ఉంది. ఈ బీటా వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ క్యూఆర్ కోడ్ ఫీచర్ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది.
ఈ విధానంలో యూపీఐ ఐడీ అవసరం లేదు. సెట్టింగ్స్ లోకి వెళ్లి పేమెంట్స్, న్యూ పేమెంట్స్ ఎంచుకుని స్కాన్ క్యూఆర్ కోడ్ ను ఓకే చేసుకోవాలి. దాంతో క్యూఆర్ కోడ్ స్కానర్ యాక్టివేట్ అవుతుంది. ముందు డబ్బులు ఎంత? అని అడుగుతుంది. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి.