bhanuchandar: ఆయన నా చేయి చూసి ఆ మాట చెప్పాడు .. అలాగే జరిగింది: భానుచందర్
- తొలి సినిమా సమయంలో నిరాశ ఎదురైంది
- ఆ తరువాత సినిమా హిట్ అయింది
- ఆయన మాటలు నిజమయ్యాయి
తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భానుచందర్, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. ఆస్ట్రాలజీని తాను నమ్మడానికి గల కారణం గురించి చెబుతూ .. "మా ఇంటికి డాక్టర్ జితేంద్రగారు వచ్చేవారు .. ఆయన ఆస్ట్రాలజీ కూడా చెప్పేవారు. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు .. నా జాతకం చెప్పమని మా అమ్మ అడిగింది.
ఆయన నా చేయి చూసి .. "పెద్దహీరో అవుతాడు .. తొలి ప్రయత్నంలో ఫెయిలయ్యాకే హీరో అవుతాడు" అన్నారు.
అలా ఆయన చెప్పిన కొన్ని రోజులకే హీరోగా నాకు ఛాన్స్ వచ్చింది. తొలిరోజు షూటింగులో చేశాను .. రెండవ రోజున నన్ను తప్పించారు. ముందుగా ఆ పాత్ర కోసం శరత్ బాబును అడిగితే .. వేరే సినిమా వల్ల ఆయన ఇది చేయలేనని చెప్పారట. ఆ తరువాత అవతల సినిమా కేన్సిల్ కావడంతో ఈ సినిమా కోసం వచ్చేశాడు. అందువలన నన్ను తీసేశారు. ఆ తరువాత 'తరంగిణి' సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది .. ఆ సినిమా నన్ను పెద్ద హీరోను చేసింది" అంటూ చెప్పుకొచ్చారు.