KTR: హీరోయిన్ సమంతకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు: కేటీఆర్
- దశాబ్దాలుగా తెలంగాణ చేనేత కార్మికులు వలస పోతున్నారు
- దేశ వ్యాప్తంగా తెలంగాణ చేనేత కార్మికులు ఉన్నారు
- టీఆర్ఎస్ పాలనలో చేనేతకు స్వర్ణ యుగం వచ్చింది
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో చేనేతకు స్వర్ణ యుగం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ నెలకొన్న కష్టాలతో దశాబ్దాల కాలంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు తెలంగాణ చేనేత కార్మికులు వలస వెళ్లారని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు ఉన్నారని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత ఎందరో నాయకులు వచ్చారని, పోయారని... అయినా చేనేత కార్మికుల జీవితాలు మాత్రం మారలేదని అన్నారు.
అయితే, తమది అలాంటి సర్కారు కాదని, చేనేత రుణమాఫీని పక్కాగా ప్లాన్ చేసి, అమలు చేస్తున్నామని తెలిపారు. చేేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేకున్నప్పటికీ... టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని చెప్పారు. చేనేత బ్రాండ్ అంబాసడర్ గా హీరోయిన్ సమంత ఉచితంగానే వ్యవహరిస్తున్నారని... ఆమెకు ప్రభుత్వం ఒక్క పైసా చూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఈరోజు శాసనమండలిలో చేనేతపై మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.