Cricket: స్మిత్ పై ఏడాది నిషేధం అమలైతే అతనికి వచ్చే నష్టం ఇదే!
- స్మిత్ కు సీఏ వేతనం 19.71 కోట్లు
- ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు వేతనం 12 కోట్ల రూపాయలు
- శామ్ సంగ్, న్యూ బ్యాలెన్స్ సంస్థల రెమ్యూనరేషన్
బాల్ టాంపరింగ్ కు మద్దతు తెలిపిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై సీఏ ఏడాది నిషేధం విధించనున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై జేమ్స్ సదర్లాండ్ స్పష్టమైన ప్రకటన చేయనున్నాడు. ఇదే నిజమైతే, స్మిత్ సుమారు 20 కోట్ల రూపాయలు నష్టపోనున్నాడని తెలుస్తోంది. సీఏ నుంచి మ్యాచ్ ఫీజుల రూపంలో మొత్తం సుమారు 19.71 కోట్ల రూపాయలను స్మిత్ వేతనంగా అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏడాది నిషేధం అతనిపై అమలైతే.. 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు దూరం కానున్నాడు.
ఒక్కో టెస్టుకు 14,000 డాలర్లు, ఒక్కో వన్డేకు 7,000 డాలర్లు, ఒక్కో టీ20కి 5,000 డాలర్ల వేతనాన్ని స్మిత్ సీఏ నుంచి అందుకునేవాడు. అంతే కాకుండా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అందించనున్న 12 కోట్ల రూపాయలతో పాటు, శామ్ సంగ్, న్యూ బాలెన్స్ తదితర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పొందే రెమ్యూనరేషన్ ను కోల్పోనున్నాడు. స్మిత్ పై నిషేదం అమలైదే, ఈ ఉత్పత్తుల సంస్థలు స్మిత్ తో ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉంది. దీంతో స్మిత్ కు భారీ నష్టం వాటిల్లనుంది.