KIng Cobra: 'కింగ్ కోబ్రా'కి ధైర్యంగా బాటిల్‌తో నీళ్లు తాగిస్తున్న పోలీసులు....వీడియో వైరల్
- ఉత్తర కన్నడ జిల్లాలో దప్పికతో అలమటిస్తున్న 12 అడుగుల తాచుపాము
- గుర్తించిన అటవీ సిబ్బంది...దాహం తీర్చిన వైనం
- దక్షిణభారతంలో నీటి కొరతతో మూగజీవాలు క్షీణిస్తున్నాయని వెల్లడి
దప్పికతో అలమటిస్తున్నట్లు గుర్తించిన దాదాపు 12 అడుగుల పొడవైన తాచుపాముకు వన్యమృగ సంరక్షణ శాఖ సిబ్బంది ధైర్యంగా బాటిల్‌లో నీరు పడుతుండటం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా, కైగా టౌన్ షిప్‌లోని ఓ గ్రామంలో ఈ పామును అధికారులు గుర్తించి, కాపాడారు. వారిలా బాటిల్‌తో దాని దాహం తీర్చే ప్రయత్నం చేశారు. ఈ రకంగా వారు తమ విధుల్లో భాగంగా మూగజీవాల దాహం తీరుస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, ఫలితంగా ఈ ప్రాంతంలోని వన్యమృగాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని వారు చెబుతున్నారు.