geetanjali: పాత సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను: సీనియర్ నటి గీతాంజలి
- ఆ తరం వేరు .. ఆ అభిమానాలు వేరు
- నా సీనియర్స్ ను నేను గౌరవిస్తాను
- నాతో వాళ్లు ఎంతో ఆత్మీయంగా వుంటారు
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను పోషించి తనదైన ముద్ర వేసిన గీతాంజలి, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన తోటి నటీనటులను తలచుకున్నారు. "ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఆ రోజులు .. ఆ పద్ధతులు మళ్లీ చూడలేం. సావిత్రి గారు .. జమున గారు .. షావుకారు జానకి గారు .. బి. సరోజాదేవి గారు .. అంజలీదేవి గారు .. కృష్ణకుమారి గారు అద్భుతమైన పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించారు. వాళ్లందరికీ మంచి మంచి కథలు .. పాత్రలు పడటం వలన ఏలేశారు.
నా సీనియర్స్ అందరితోనూ నేను టచ్ లో వుండే దానిని. వాళ్లంతా నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇప్పటికీ అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతూ వుంటాను. మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరినీ తలచుకుంటూ వుంటాను .. టీవీల్లో పాత సినిమాలు వచ్చినప్పుడు .. వాళ్లతో గల అనుబంధాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ వుంటాను" అంటూ చెప్పుకొచ్చారు.