molest: దేశంలోనే తొలిసారి.. విస్తారా ఎయిర్‌హోస్టెస్‌ను లైంగికంగా వేధించిన ప్రయాణికుడిపై నిషేధం!

  • విమానం దిగుతూ ఎయిర్‌హోస్టెస్‌పై వృద్ధుడి లైంగిక వేధింపులు
  • నో-ప్లై లిస్ట్‌లో అతడిని చేర్చాలంటూ డీజీసీఏను కోరిన విస్తారా
  •  ఇక జీవితాంతం విమాన ప్రయాణానికి దూరం కానున్న నిందితుడు

విస్తారా విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన 62 ఏళ్ల  పూణె వాసిపై నిషేధం వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. అతడిని నో-ఫ్లై లిస్ట్ (ఎన్ఎఫ్ఎల్)లో చేర్చాలంటూ డీజీసీఏను విస్తారా కోరింది. దీంతో అతడిపై మూడు నెలల నుంచి జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. అంటే అతడు జీవితంలో ఇక విమాన ప్రయాణం చేయలేడన్నమాట.

పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 24న లక్నో నుంచి ఢిల్లీ వచ్చిన విస్తారా విమానం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ల్యాండైంది. విమానం దిగుతుండగా పూణెకు చెందిన 62 ఏళ్ల వృద్ధుడు ఎయిర్‌హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడు. ఆమెపై అసభ్యకరంగా చేతులు వేశాడు. దీంతో ఆమె వెంటనే సీనియర్లకు సమాచారం అందించింది. వారి సలహా మేరకు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అతడికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇక, ఎన్ఎఫ్‌ జాబితాలో పేరెక్కిన ప్రయాణికుడిపై మూడు నెలల నుంచి జీవిత కాలంపాటు విమాన ప్రయాణంపై నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ప్రయాణికుడి అనుచిత ప్రవర్తనపై విస్తారా నియమించిన అంతర్గత కమిటీ 30 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కనుక ఒకసారి ప్రయాణికుడి పేరును ఎన్ఎఫ్ఎల్ జాబితాలోకి ఎక్కిస్తే ఇతర విమానయాన సంస్థలు కూడా అతడిని నిషేధిస్తాయి.

  • Loading...

More Telugu News