Sonali bindre: ముద్దుగుమ్మ సోనాలి బింద్రే ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

  • నా కుటుబం ఫిట్‌గా ఉండాలంటే ముందు నేను ఫిట్‌గా ఉండాలి
  • రోజూ బాదం పప్పులు తింటూ వ్యాయామం చేస్తాను
  • 'ఆల్మండ్ బోర్డు ఆఫ్ కాలిఫోర్నియా' కార్యక్రమంలో సోనాలి

'మన్మథుడు', 'ఇంద్ర' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ సుందరి సోనాలి బింద్రే తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బహిర్గతం చేసింది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటిస్తానని, ఎక్కువగా బాదం పప్పులు తింటుంటానని, క్రమం తప్పకుండా ధ్యానం, వ్యాయామం చేస్తుంటానని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. "నా కుటుంబాన్ని దృఢంగా ఉంచాలంటే తొలుత నేను ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యమని గ్రహించాను" అని ఆమె చెప్పుకొచ్చింది. పనిచేసే తల్లుల విషయానికొస్తే, పని-కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను నెలకొల్పడం కీలకమని ఆమె తెలిపింది.

మన జీవితాల్లోని ఏ ఒక్క ముఖ్యమైన ఘట్టాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఆమె చెప్పింది. మన పిల్లలు, మన కుటుంబ ఆరోగ్యం, మన సొంత ఆరోగ్యం, ఫిట్‌నెస్, మన పెళ్లి, మన కెరీర్‌ పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సోనాలి తెలిపింది. ఆల్మండ్ బోర్డు ఆఫ్ కాలిఫోర్నియా ముంబైలో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఇందులో పనిచేసే మహిళలు తమ కెరీర్‌ను ఎలా మలుచుకుంటున్నారు, తల్లులుగా, భార్యలుగా, చివరికి కోడళ్లుగా కుటుంబ నిర్వహణ పరంగా వారి బాధ్యతలు తదితర అంశాలపై చర్చ చేపట్టారు. ఇందులో పాల్గొన్న సోనాలి తన ఫిట్‌నెస్‌ గురించి ఆమె చెబుతుంటే అక్కడి వారంతా శ్రద్ధగా ఆలకించారు.

  • Loading...

More Telugu News