ICICI: ఐసీఐసీఐకి భారీ పెనాల్టీ వేసిన ఆర్బీఐ!

  • నిబంధనలు పాటించని ఐసీఐసీఐ
  • రూ. 58.90 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ
  • కస్టమర్ల లావాదేవీలపై ప్రభావముండదని వ్యాఖ్య

సెక్యూరిటీ బాండ్ల ప్రత్యక్ష అమ్మకాల్లో నిబంధనలు పాటించని ఐసీఐసీఐ బ్యాంకుపై భారీ పెనాల్టీని విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 26వ తేదీతో జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ తన హెచ్ఎంటీ పోర్ట్ పోలియో గురించిన పూర్తి వివరాలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రూ. 58.9 కోట్లను జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.

సెక్యూరిటీ బాండ్ల విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బ్యాంకు ఈ నిబంధనలను పాటించలేదని వెల్లడించింది. ఈ జరిమానా కారణంగా లావాదేవీల వ్యాలిడిటీ, లేదా బ్యాంకు తమ కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 47 ఏ (1) (సీ), రెడ్ విత్ సెక్షన్ 46 (4) (ఐ)కింద ఈ జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జోస్ కే ఖట్టూర్ ఈ నోటీసుల్లో వెల్లడించారు.

  • Loading...

More Telugu News