malala: పాకిస్థాన్‌ పర్యటనలో కన్నీరు పెట్టుకున్న మలాలా యూసఫ్‌ జాయ్‌

  • నాలుగు రోజుల పాక్‌ పర్యటనలో మలాలా
  • పాక్ ప్రధాని ఇంటికి వెళ్లిన నోబెల్‌ గ్రహీత
  • విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు తనకు పాక్ గుర్తుకు వచ్చేదని భావోద్వేగం

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌ సుమారు ఆరేళ్ల తరువాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన నాలుగు రోజుల పాక్ పర్యటనలో భాగంగా మలాలా ఈ రోజు ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసీతో భేటీకి వెళ్లి.. మీడియాతో మాట్లాడింది.

ఐదున్నరేళ్ల తర్వాత మళ్లీ స్వదేశానికి రావడం సంతోషంగా ఉందని, సొంత మనుషుల మధ్య స్వదేశంలో తిరిగి కాలు పెట్టానని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు తనకు పాకిస్థాన్ గుర్తుకు వచ్చేదని భావోద్వేగానికి గురై కన్నీరు కార్చింది. తాను పాక్‌లో ఎలాంటి భయం లేకుండా, పర్యటిస్తూ ప్రజలతో శాంతియుతంగా గడపాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. 

  • Loading...

More Telugu News