Pakistan: 'ఎయిర్‌పోర్టులో పాక్ ప్రధానికి అవమానం' ఘటనపై వివరణ ఇచ్చిన అమెరికా దౌత్యాధికారి
- ఓ దేశ ప్రధాని డిప్లొమటిక్ పాస్‌పోర్ట్ లేకుండా ప్రైవేట్‌గా ప్రయాణిస్తే ఇలాగే తనిఖీలు చేస్తారు
- వారిని సామాన్య పౌరులుగానే భావిస్తారు
- అధికారిక పర్యటనలో మాత్రం ఇలా చేయరు
అమెరికా విమానాశ్రయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి అబ్బాసీకి అవమానం జరిగిన విషయం తెలిసిందే. ఆయన బ్యాగు, కోటు పట్టుకుని ఎయిర్ పోర్టు సెక్యూరిటీ నడుచుకుంటూ వెళ్లిన ఓ వీడియో మీడియాకు చిక్కడంతో అమెరికాపై పాకిస్థానీయులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి అలెక్జాండెర్ మెక్‌లారెన్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఎయిర్ పోర్టు సిబ్బంది అలా ఎందుకు చేశారో వివరించారు.
తనకు తెలిసింతన వరకు ఓ దేశ ప్రధాని డిప్లొమటిక్ పాస్‌పోర్ట్ లేకుండా ప్రైవేట్‌గా పర్యటించాలనుకున్నప్పుడు వారిని సామాన్య పౌరులుగానే భావిస్తారని, అలాంటప్పుడు సామాన్యుడిని ఎలా తనిఖీ చేస్తారో ప్రధానిని కూడా అలాగే చేస్తారని వివరించారు. అధికారిక పర్యటనలో మాత్రం ఇలా చేయరని చెప్పారు.