West Bengal: ఐపీఎస్ పై దాడి ఘటనలో కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్

  • శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్న అల్లర్లు
  • అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
  • అదే ప్రాంతంలో పర్యటించాలని భావించిన బాబుల్ సుప్రియో

ఐపీఎస్ అధికారిపై దాడి ఘటనలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు రేగడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.  తన నియోజకవర్గం పరిథిలోని అసన్ సోల్ లో పర్యటించేందుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ప్రయత్నించారు.

దీనికి పోలీసులు అభ్యంతరం చెప్పడంతో, ఆయన కల్యాణ్ పూర్ ప్రాంతంలో పర్యటించారు. అయితే, అక్కడ కూడా ఆయనను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాబుల్ సుప్రియో, ఐపీఎస్ అధికారి రుపేశ్ కుమార్ చెంప ఛెళ్లుమనిపించారు. పర్యవసానంగా బాబుల్ సుప్రియోపై పోలీసులు, 144 సెక్షన్ ఉల్లంఘన, విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిపై దాడి, అల్లర్లకు పాల్పడడం వంటి నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, పోలీసులే తనపై దాడి చేశారని అన్నారు. 

  • Loading...

More Telugu News