Pakistan: నీటి అడుగున ఉండి విరుచుకుపడే సబ్ మెరైన్ మిస్సైల్... బాబర్ ను ప్రయోగించిన పాకిస్తాన్
- పాకిస్తాన్ దేశీయ తయారీ మిస్సైల్
- 450 కిలోమీటర్ల లక్ష్యాలను చేరే సామర్థ్యం
- విజయవంతంగా లక్ష్యాలను చేరిన క్షిపణి
సబ్ మెరైన్ ( సముద్ర గర్భంలో విహరించే ) నుంచి ప్రయోగించేందుకు ఉద్దేశించిన క్రూయిజ్ మిస్సైల్ బాబర్ ను పాకిస్తాన్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. 450 కిలోమీటర్ల లక్ష్యాలను ఇది చేరుకోగలదు. నీటి లోపల ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఈ క్షిపణిని పరీక్షించి చూశారు. అనుకున్న లక్ష్యాన్ని చేరింది. ఇందులో ఎన్నో టెక్నాలజీలను పాక్ ఉపయోగించింది. తాాజా ప్రయోగం ద్వారా పాకిస్తాన్ తన బలాన్ని మరికాస్త పెంచుకున్నట్టయింది. దీన్ని దేశీయంగానే రూపొందించినట్టు పాకిస్తాన్ చెబుతోంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అభినందించారు.