ball tamparing: ఇదేం శిక్ష? అని పెదవి విరిచిన హర్భజన్!

  • బాల్ టాంపరింగ్ వివాదంలో ముగ్గురు క్రికెటర్లపై చర్యలు తీసుకున్న ఐసీసీ, సీఏ
  •  ఇంత వివక్షా? అంటూ ఐసీసీ నిర్ణయాన్ని ప్రశ్నించిన హర్భజన్ సింగ్
  • చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా? అంటూ ఆవేదన వ్యక్తం చేసిన భజ్జీ

ఆసీస్ క్రికెటర్ల బాల్ ట్యాంపరింగ్ వివాదంపై టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ చిత్రంగా స్పందించాడు. ఐసీసీ ఏడాది నిషేధం విధించగానే, మండిపడిన హర్భజన్.. 'వావ్ ఐసీసీ. ట్యాంపరింగ్‌ వివాదంలో గొప్ప శిక్షే వేశారు. అన్ని ఆధారాలున్నా బాన్‌ క్రాఫ్ట్‌ పై నిషేధం లేదు. గతాన్ని మర్చిపోయారా? మితిమిరి అప్పీల్‌ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌ లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కో మ్యాచ్‌ నిషేధం విధించారు. 2008 సిడ్నీ టెస్టులో ఎలాంటి ఆధారాలు లేకుండానే జాతి వివక్ష వ్యాఖ్యలంటూ (మంకీగేట్‌ వివాదం) నాపై మూడు టెస్టుల వేటేశారు. వ్యక్తిని, అతను ప్రాతినిధ్యం వహించే జట్టును బట్టి అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?' అంటూ ట్వీట్టర్ మాధ్యమంగా హర్భజన్ సింగ్ నిలదీశాడు.

తాజాగా యూ టర్న్ తీసుకుని... 'కేవలం బాల్ ట్యాంపరింగ్‌ కు పాల్పడ్డారన్న కారణంగా ఆసీస్ ఆటగాళ్లపై ఏడాది నిషేధం విధించడం జోక్‌. వాళ్లు ఏ నేరానికి పాల్పడ్డారని ఇంత పెద్ద శిక్ష వేశారు? ఆట నుంచి ఏడాది పాటు దూరం చేయడం తెలివి తక్కువ నిర్ణయం. ఒక టెస్ట్ సిరీసో లేక రెండు సిరీస్‌ లకు నిషేధం పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇది దారుణం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ లపై నిషేధం గడువును క్రికెట్ స్ట్రేలియా తగ్గించాలి' అంటూ తాజాగా హర్భజన్ ట్వీట్ చేశాడు.


  • Loading...

More Telugu News