table tennis: ఆటకు గుడ్ బై చెబితే.. బాలీవుడ్ సినిమాలలో నటిస్తాను: టీటీ ప్లేయర్ మనికా

  • కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననున్న మనికా బాత్రా
  •  బాలీవుడ్ సినిమాలలో నటిస్తా
  • ఆట, నటన రెండూ ఇష్టమే
ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే బాలీవుడ్ లో అడుగుపెడతానని టీటీ ప్లేయర్ మనికా బాత్రా తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మనికా బాత్రా ఢిల్లీలో మాట్లాడుతూ, కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకం తేవడమే లక్ష్యమని చెప్పింది. క్రీడల నుంచి తప్పుకుంటే మాత్రం బాలీవుడ్ లో అడుగుపెడతానని స్పష్టం చేసింది. నటిగా రాణించాలని ఉందని తన అభిలాషను మనికా వ్యక్తం చేసింది. టేబుల్ టెన్నిస్, నటన రెండూ ఇష్టమేనని తెలిపింది. 
table tennis
manika batra
sports

More Telugu News