taj mahal: తాజ్ మహల్ సందర్శన సమయంపై పరిమితి విధించిన అధికారులు

  • 3 గంటల కంటే ఎక్కువ సమయం అక్కడ ఉండేందుకు వీలు లేదు
  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
  • ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన

ఆగ్రాలోని ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ప్రాంగణంలో ఇకపై మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఉండేందుకు వీలు లేదు. తాజ్ మహల్ సందర్శనకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉండటంతో తాకిడిని నియంత్రించే నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది.

కాగా, తాజ్ మహల్ వద్ద ముఖ్యంగా వారాంతాలు, సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. సాయంత్రం గేట్లు మూసే వరకు తాజ్ మహల్ ప్రాంగణంలోనే గడుపుతుంటారు. దీంతో, నిరంతరం రద్దీగా వుంటుంది. ఈ విషయమై పర్యావరణ విశ్లేషకులు చేసిన సూచన మేరకు ఏఎస్ఐ కొత్త నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం ప్రకారం, తాజ్ మహల్ సందర్శకులు టికెట్ కొనుగోలు చేసిన సమయం నుంచి మూడు గంటలు మాత్రమే అక్కడి ప్రాంగణంలో ఉండేందుకు అనుమతించనున్నారు. మూడు గంటలకు మించి అక్కడే ఉండాలనుకున్న సందర్శకులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News