murali mohan: ప్రోత్సహించినవారే ద్వేషిస్తారు.. ప్రస్తుతం మోదీ పరిస్థితి ఇదే: మురళీ మోహన్
- పాత నోట్ల రద్దుతో నల్లధనం పోతుందని ప్రజలు భావించారు
- కొందరి వద్ద భారీ ఎత్తున కొత్త నోట్లు కనిపించడంతో జనాలకు నమ్మకం పోయింది
- జీఎస్టీ వల్ల కూడా అన్యాయమే జరుగుతోంది
ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెపుతుంటారని... ఎదిగే క్రమంలో చాలా వినయంగా ఉండాలని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. తలపొగురు చూపించే వారికి మొట్టికాయలు వేస్తారని... ప్రోత్సహించినవారే ద్వేషించే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాని మోదీ పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు... ఎన్నో ఇబ్బందులు తలెత్తినా, మోదీ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతించారని చెప్పారు.
తమకు కష్టాలు ఎదురైనా... నల్లధనం పోతుందని ప్రజలు భావించారని... అయితే కొందరి వద్ద భారీ ఎత్తున కట్టలు కట్టలుగా కొత్త నోట్లు కనిపిించడంతో ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. జీఎస్టీ విషయంలో కూడా ఇదే జరిగిందని... దాని వల్ల చాలా మందికి అన్యాయమే జరుగుతోందని చెప్పారు. ఏపీ విషయంలో కూడా మోదీ వ్యవహారశైలి తప్పుగా ఉందని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని... దీనికి మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పిన మోదీ... ఆ పని కూడా చేయలేదని అన్నారు. నేర చరిత్ర ఉన్నవారికి కూడా మోదీ ప్రభుత్వం చేరువవుతోందని చెప్పారు.