Rajinikanth: స్టెరిలైట్ ఆందోళన...తమిళ సర్కార్‌పై సూపర్ స్టార్ రజనీ ఫైర్
- స్టెరిలైట్ విస్తరణకు అనుమతిపై సీరియస్
- స్థానికుల ఆందోళన పట్టదా? అని సూటిప్రశ్న
- 47 రోజులుగా గ్రామస్థుల ఆందోళన
తూత్తుకూడి-మధురై బైపాస్‌లో ఉండే స్టెరిలైట్ కర్మాగారం విస్తరణకు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్టెరిలైట్ కారణంగా ఎంతోమంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా కర్మాగార విస్తరణకు అనుమతినిచ్చింది. 47 రోజులుగా అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన పట్టదా?' అంటూ ట్విట్టర్ వేదికగా రజనీ అన్నాడీఎంకే నేతృత్వంలోని తమిళనాడు సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
స్టెరిలైట్ కంపెనీ విస్తరణ పనులకు వ్యతిరేకంగా గతనెల 12 నుంచి స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళన కారణంగా సంస్థను 15 రోజుల పాటు మూసివేశారు. కాగా, కావేరీ జలాల విషయంలోనూ ఇటీవల ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.