ashok leyland: ఏపీకి మరో మణిహారం.. అశోక్ లేల్యాండ్ ప్లాంటుకు భూమి పూజ చేసిన చంద్రబాబు

  • అమరావతి సమీపంలో బస్ బాడీ యూనిట్
  • 75 ఎకరాల్లో 4800 బస్సుల సామర్థ్యంతో ప్లాంట్
  • స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలన్న చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ కు మరో భారీ కంపెనీ వచ్చింది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేల్యాండ్ అమరావతి పరిధిలోని మల్లపల్లి పారిశ్రామికవాడలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేశారు. రూ. 135 కోట్ల వ్యయంతో ఈ యూనిట్ ను అశోక్ లేల్యాండ్ నెలకొల్పుతోంది. 75 ఎకరాల్లో 4800 బస్సుల తయారీ సామర్థ్యంతో ప్లాంట్ ను నిర్మించబోతోంది. దాదాపు 2,300 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇసుజు, కియా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి వచ్చాయని అన్నారు. ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద బస్సుల తయారీదారు అశోక్ లేల్యాండ్ అని తెలిపారు. ఇండియాలో తమ ఎనిమిదవ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ఇక్కడ పెడుతున్నారని చెప్పారు. ఈ ప్లాంట్ లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని తెలిపారు. అశోక్ లేలాండ్ కోసం రైతులు తమ భూములను ఉదారంగా ఇచ్చారని చెప్పారు. మల్లపల్లి పారిశ్రామికవాడలో 828 సంస్థలు రానున్నాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News