Karnataka: కర్ణాటకలో అప్పుడే ఓటర్లను ప్రలోభ పెడుతోన్న నేతలు.. దొరికిపోయిన మహిళా నేత
- మే 12న అసెంబ్లీ ఎన్నికలు
- పోటాపోటీగా ప్రచారం
- ఓ ట్రక్కులో తనిఖీలు
- ఫ్రెషర్ కుక్కర్లు స్వాధీనం
కర్ణాటకలో మే 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాగే, ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ కొందరు నేతలు అధికారులకు చిక్కుతున్నారు. ఈ రోజు ఆ రాష్ట్రంలోని బెళగవి నుంచి వెళుతోన్న ఓ ట్రక్కును అధికారులు తనిఖీ చేయగా, అందులో మహిళా కాంగ్రెస్ సెల్ అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాల్కర్ ఫొటోలతో ఉన్న ప్రెషర్ కుక్కర్ బాక్సులను గుర్తించారు.
వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌కి ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు.