Suresh Raina: అయ్యో పాపం....! క్రికెటర్ రైనా ఇలా అయిపోయాడేంటి?

  • రికవరీ పంప్‌తో రిలాక్స్ అవుతున్న రైనా
  • వ్యాయామాల అనంతరం ఒకటి రెండు గంటల్లోనే నొప్పులు మాయం
  • అంతర్జాతీయంగా పలు దేశాల్లో వినియోగం

క్రికెటర్ సురేశ్ రైనాకి ఏమైంది? అతనిలా అయిపోయాడేంటి? అని అనుకుంటున్నారా? కంగారు పడాల్సిన పనేం లేదు. 'రికవరీ పంప్' అనే ఓ కిట్‌ ద్వారా అతను వ్యాయామాల తర్వాత వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందుతున్నాడు. ఈ వ్యవస్థ క్రీడాకారులు వ్యాయామాలు చేసి అలసిపోయినప్పుడు శారీరక నొప్పుల నుంచి త్వరితగతిన రికవరీ పొందడానికి, కండరాలు బిగుసుకుపోవడం లాంటి పరిస్థితులను తగ్గించడానికి దోహదం చేస్తుంది.

ఈ కిట్‌ను సింపుల్‌గా 'మజిల్ రికవరీ'గా పేర్కొంటారు. ఇది ఒకటి రెండు గంటల్లోనే కండరాల నొప్పులను హరిస్తుంది. ఈ రికవరీ పంప్‌ను అంతర్జాతీయంగా చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన వ్యవస్థ అని తయారీదారులు చెబుతున్నారు. రికవరీ పంప్ అనేది ఓ గ్రాడ్యుయేటెడ్ సీక్వెన్షియల్ కంప్రెషన్ వ్యవస్థ.

  • Loading...

More Telugu News