BJP: నరసింహారావు గారు! మోదీలోని మంచి లక్షణాలు మీకు కనిపించలేదా?: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • నరసింహారావు చేసిన విశ్లేషణలో ఏ ఒక్కటీ వాస్తవం లేదు
  • అది విశ్లేషణ కాదు అహంకారపూరిత, అగ్రకుల వ్యాఖ్యానం
  • మోదీపై నరసింహారావు చెప్పినవి తప్పని నిరూపిస్తా

ఇతరుల లోపాలను గుర్తించడం ప్రధాని మోదీకి ఉన్న అవలక్షణమంటూ వ్యాఖ్యానించిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావుపై బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, మోదీలోని చెడు లక్షణాలను గుర్తించిన ఆయనకు, మంచి లక్షణాలు ఎందుకు కన్పించలేదని ప్రశ్నించారు.

నరసింహారావు చేసింది వ్యక్తిత్వ వికాసంపై విశ్లేషణలా లేదని, అహంకారపూరిత, అగ్రకుల వ్యాఖ్యానంలా ఉందని దుమ్మెత్తిపోశారు. అగ్రవర్ణాలకే అధికారం ఉండాలా? అని ప్రశ్నించిన ఆయన, ఈ విశ్లేషణలో ఒక్కటీ వాస్తవం లేదని, ఉన్నతమైన వ్యక్తులు గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. మోదీపై నరసింహారావు చెప్పినవి తప్పని నిరూపిస్తానని అన్నారు.

ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నరసింహారావు


ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం నరసింహారావుకు తగదని, ఏపీలో జరుగుతున్న కుట్ర రాజకీయాల్లో ఆయన పావుగా మారారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.  

  • Loading...

More Telugu News