andhra pradesh bifurcation act: ఏపీ విభజన చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ.. కేంద్రానికి నోటీసులు!
- విభజన చట్టంపై సుప్రీంకోర్టులో పొంగులేటి పిటిషన్
- విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
- వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల గడువు కోరిన కేంద్రం
ఏపీ విభజన చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది.
నాలుగేళ్లు గడిచిపోయినా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. సమాధానం ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.