China: దిగుమతి సుంకాన్ని పెంచుతూ... డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిన చైనా!
- స్టీలు, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని పెంచిన అమెరికా
- దెబ్బకు దెబ్బ కొట్టిన చైనా
- 128 వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచిన చైనా
అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ముదురుతోంది. స్టీలు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచి, దెబ్బకుదెబ్బ కొట్టింది చైనా.
దాదాపు 128 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. వీటిలో 120 ఉత్పత్తులపై 15 శాతం, మరో 8 వస్తువులపై 25 శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్టీలు, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి కౌంటర్ ఇచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.