Narendra Modi: నియంత్రణ కోల్పోతున్న మోదీ.. 'ఫేక్ న్యూస్ ఆర్డర్‌'ను వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాల విమర్శ

  • ప్రధానిపై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్షాలు
  • ప్రజల ఆగ్రహానికి భయపడే మోదీ యూటర్న్ అన్న రాహుల్
  • ఫేక్ న్యూస్ వల్ల ఎక్కువగా లాభపడింది బీజేపీయేనన్న ప్రతిపక్షాలు 

ఫేక్ న్యూస్ ఆదేశాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ప్రధాని నరేంద్రమోదీ తన ప్రభుత్వంపై నియంత్రణ కోల్పోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించాయి. ఫేక్ న్యూస్ ఆర్డర్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఆదేశాలను సమాచార మంత్రిత్వశాఖ వెనక్కి తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఫేక్ న్యూస్ ఆదేశాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతాయని గ్రహించిన మోదీ సొంత ఆదేశాలపై యూటర్న్ తీసుకున్నారని ఆక్షేపిస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై మోదీ నియంత్రణ కోల్పోతున్నారన్న విషయం దీంతో తేటతెల్లమైందని విమర్శించారు.

కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ ఫేక్ న్యూస్ ఆదేశాలు మోదీకి తెలియకుండా జారీ అయ్యాయంటే నమ్మడం కష్టంగా ఉందన్నారు. ఫేక్ న్యూస్ గురించి బీజేపీ-ఆరెస్సెస్‌కే ఎక్కువ తెలుసని, దానివల్ల లబ్ధి పొందేది వారేనని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో వారికి తెలిసినంతగా మరెవరికీ తెలిసి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ తదితరులు కూడా ప్రధానిపై విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News