youtube: కాల్పుల ఘటనపై సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ స్పందన
- యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు జరిపిన మహిళ
- ముగ్గురికి గాయాలు
- ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు
అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద నిన్న ఉదయం ఓ మహిళ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ కాల్పులతో బెంబేలెత్తిపోయిన యూట్యూబ్ ఉద్యోగులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత ఆమె తనను తాను కాల్చుకుని చనిపోయింది.
ఈ కాల్పుల ఘటనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూట్యూబ్ ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని సత్య నాదెళ్ల చెప్పారు. వారు త్వరగా ఈ షాక్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ఇది మాటలకు అందని విషాదమని చెప్పారు. ఆ విషాదాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదని చెప్పారు.