icc: ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్టీవ్ స్మిత్
- రెండో స్థానంలో కోహ్లీ
- మూడో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్
- నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
- ఐదో స్థానంలో డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడంతో నిషేధం ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (929 పాయింట్లతో) అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (912), మూడో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (867), నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (847) నిలిచారు. ఇక నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ (820 పాయింట్లతో) ఐదో స్థానం దక్కించుకున్నాడు.
కాగా, ఐసీసీ టెస్టు బౌలర్లలో దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబాడ (897 పాయింట్లతో) అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (891), మూడో స్థానంలో సౌతాఫ్రికా బౌలర్ ఫిలాండర్ (845), నాలుగో స్థానంలో భారత బౌలర్ రవీంద్ర జడేజా (844), ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (803) ఉన్నారు.