Tanvita: పెంచిన తల్లికే తన్విత... ఐదు నెలల తరువాత అమ్మ దగ్గరకు!

  • ఇల్లెందులో సంచలనం రేపిన తన్విత కేసు
  • పెంచిన తల్లి, కన్న తల్లి మధ్య ఐదున్నర నెలుగా వివాదం
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం

తెలంగాణలోని ఇల్లెందులో దాదాపు ఐదున్నర నెలల క్రితం సంచలనం రేపిన తన్విత కేసులో, పెంచిన తల్లికే పాప చెందుతుందని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. కన్నతల్లి ఉమ, పెంచిన తల్లి స్వరూపలు ఇద్దరూ బిడ్డ తమకే చెందాలని పోలీసులను ఆశ్రయించడంతో, పాపను 150 రోజులుగా బాలసదన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో తన్విత పెంచిన తల్లి వద్దకు చేరింది.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, గార్ల మండలం చిన్న కిష్టాపురానికి చెందిన ఉమ, భావ్ సింగ్ దంపతులు తమకు ఆడపిల్ల పుట్టగానే, ఓ ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో ఇల్లెందుకు చెందిన స్వరూప, రాజేంద్ర ప్రసాద్ దంపతులకు దత్తత ఇచ్చారు. ఆపై మూడు సంవత్సరాల తరువాత, ఉమ వచ్చి, తనకు తెలియకుండా బిడ్డ దత్తత జరిగిందని, బిడ్డను తనకు అప్పగించాలని కోరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఆపై పోలీసులు విచారణ జరిపి, ఉమకు దత్తత సంగతి తెలుసునని తేల్చడంతో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది తీర్పు వచ్చే వరకూ తన్వితను పెంచిన తల్లి వద్దే ఉంచాలని తీర్పు ఇచ్చింది. దీంతో 150 రోజుల తరువాత తన్విత, స్వరూప వద్దకు చేరగా, ఆమెను ఆప్యాయంగా హత్తుకున్న ఆ జంట బోరున విలపించింది. ఈ తీర్పు తమకెంతో సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా స్వరూప దంపతులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News