Rajya Sabha: రాజ్యసభ రేపటికి వాయిదా.. అయినా సభలోనే ఆందోళన కొనసాగిస్తోన్న టీడీపీ సభ్యులు
- రాజ్యసభలో మళ్లీ గందరగోళం
- చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ సభ్యుల ఆందోళన
- ప్లకార్డులు చూపుతూ నిరసన
రాజ్యసభలో గందరగోళం చెలరేగుతోన్న నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ టీడీపీ, వైసీపీ సభ్యులు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి దూసుకెళ్లడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు. అయినప్పటికీ రాజ్యసభలో టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం తమ సభ్యులకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
ఈ రోజు కూడా అవిశ్వాసం తీర్మానంపై చర్చించకుండా పార్లమెంటును వాయిదా వేస్తే సభలోనే ఉండి నిరసనలు తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ మేరకే రాజ్యసభ సభ్యులు తమ ఆందోళనను రాజ్యసభ వాయిదా పడినప్పటికీ అందులోనే కొనసాగిస్తున్నారు.